తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం- ఎమ్మెల్యే చల్లా

దిశ, కమలాపూర్: ఉప ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జోస్యం చెప్పారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, వంగపళ్లి గ్రామాలలో బుధవారం పలు కుల సంఘాల సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అలాంటి పార్టీలో తన సొంత లాభం కోసం అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఈటల […]

Update: 2021-10-13 03:56 GMT

దిశ, కమలాపూర్: ఉప ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జోస్యం చెప్పారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల, వంగపళ్లి గ్రామాలలో బుధవారం పలు కుల సంఘాల సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అలాంటి పార్టీలో తన సొంత లాభం కోసం అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరాడని ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు గిచ్చి, కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారని, ప్రజలంతా బీజేపీ నాయకుల ఆగడాలను గమనిస్తున్నారని మండిపడ్డారు.

ఈటల ఇరవై ఏళ్ల నియంత పాలనకు ఈ ఉప ఎన్నికలలో ఓటర్లు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఈటెల విస్మరించారని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News