పుల్కి.. టిక్కా.. పడక
దిశ, వెబ్‌డెస్క్: ‘పుల్కి.. టిక్కా.. పడక.. పానీ కే పటాషే..’ ఇవేవో కొత్త రకం తిట్లలా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? కానే కాదు. ఇవన్నీ మనం రోజూ ఇష్టంగా తినే పానీపూరీకి సంబంధించిన పేర్లే. అవును.. పానీపూరీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. మరి ఏ ప్రాంతంలో ఏయే పేర్లతో పిలుస్తారో తెలుసుకోవాలనుందా ? అయితే చూడండి. ఉత్తర భారతంలో తన రుచితో అందర్నీ మైమరిపించి.. అక్కడి నుంచి దక్షిణాది ప్రజలకు చేరువై.. ఆపై బంగ్లాదేశ్, నేపాల్ […]
దిశ, వెబ్‌డెస్క్: ‘పుల్కి.. టిక్కా.. పడక.. పానీ కే పటాషే..’ ఇవేవో కొత్త రకం తిట్లలా ఉన్నాయని ఆలోచిస్తున్నారా? కానే కాదు. ఇవన్నీ మనం రోజూ ఇష్టంగా తినే పానీపూరీకి సంబంధించిన పేర్లే. అవును.. పానీపూరీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. మరి ఏ ప్రాంతంలో ఏయే పేర్లతో పిలుస్తారో తెలుసుకోవాలనుందా ? అయితే చూడండి.
ఉత్తర భారతంలో తన రుచితో అందర్నీ మైమరిపించి.. అక్కడి నుంచి దక్షిణాది ప్రజలకు చేరువై.. ఆపై బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పొరుగు దేశస్తులను కూడా తన రుచితో ఫిదా చేసింది పానీపూరి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు, చిన్నారుల నుంచి పెద్దోళ్ల వరకు ఎంతోమందికి ఇది చాలా ఫేవరెట్ స్నాక్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, జార్ఖండ్‌లోని దక్షిణ ప్రాంతం, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ స్నాక్‌ను ‘గప్‌చుప్’ అనే పిలుస్తారు. నార్త్ ఇండియాలో “గోల్ గప్పా’’ అని పిలుస్తారు. అక్కడి అన్ని ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే పేరు వినిపిస్తుంది. నార్త్ నుంచే మిగతా ప్రాంతాలకు విస్తరించిన పానీపూరీ.. అక్కడ చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఇక మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, నేపాల్‌లోని కొన్ని చోట్ల గప్‌చుప్‌ను “పానీ పూరీ” గా పిలుస్తారు.
పేరుతో పాటు రుచిలోనూ భిన్నం..
అయితే ఆయా రాష్ట్రాల్లో పేరుతో పాటు రుచిలోనూ తేడాలుంటాయి. గుజరాత్‌లో బంగాళదుంపతోపాటు ఉడికించిన పెసలు, ఖర్జూరం ముక్కలను పానీపూరీలో వేస్తారు. పైగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ స్ట్రీట్ ఫుడ్‌ను ‘పకోడి’ అని పిలుస్తారు. ఇక పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ‘పుచ్కా’గా ప్రసిద్ధి పొందింది. బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే పేరు వాడుకలో ఉంది. కాకపోతే ఇది రుచిలో పానీపూరీ కంటే భిన్నంగా ఉంటుంది. సాధారణ పానీపూరీల కంటే ఇక్కడి పానీపూరీలు కాస్త పెద్దవిగా ఉంటాయి. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పానీపూరీని ‘పటాషి’ అని పిలుస్తుంటారు. ఇంకొందరు ‘పానీ కీ బటాషే’ అని కూడా అంటారు. అయితే ఇక్కడ పానీపూరీలో పోసే నీటిని మామిడికాయల రసంతో తయారు చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, నేపాల్‌లోని కొన్ని చోట్ల పానీపూరీని “ఫుల్కి” అంటారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో మాత్రమే పానీపూరీని ‘టిక్కీ’ అని పిలుస్తారు. ఇక యూపీలోని అలీఘర్‌లో పానీపూరీని ‘పడక’ అని అంటారు.