వస్త్ర పరిశ్రమకు నూతనోత్తేజం!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ పాండమిక్ భారత్ సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఐఎల్ఓ(అంతర్జాతీయ కార్మిక సంస్థ), ఏడీబీ(ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) సంయుక్త నివేదిక ప్రకారం కరోనా వల్ల భారత్‌లో 4 మిలియన్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఈ మహమ్మారి అసంఘటిత రంగ కార్మికులతో పాటు చేతివృత్తి కళాకారులను సైతం ఆగం చేసింది. ఇక వ్యవసాయం తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపే అతిపెద్ద రంగమైన టెక్స్‌టైల్ ఇండస్ట్రీ లాక్‌డౌన్ వల్ల డీలా పడిపోయింది. ప్రయాణాలకు అనుమతి లేకపోవడంతో స్టాక్ […]

Update: 2020-12-13 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ పాండమిక్ భారత్ సహా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఐఎల్ఓ(అంతర్జాతీయ కార్మిక సంస్థ), ఏడీబీ(ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) సంయుక్త నివేదిక ప్రకారం కరోనా వల్ల భారత్‌లో 4 మిలియన్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. ఈ మహమ్మారి అసంఘటిత రంగ కార్మికులతో పాటు చేతివృత్తి కళాకారులను సైతం ఆగం చేసింది. ఇక వ్యవసాయం తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపే అతిపెద్ద రంగమైన టెక్స్‌టైల్ ఇండస్ట్రీ లాక్‌డౌన్ వల్ల డీలా పడిపోయింది. ప్రయాణాలకు అనుమతి లేకపోవడంతో స్టాక్ అలాగే ఉండిపోయింది, అమ్మకాలు తగ్గాయి. 25 లక్షల మంది నేత కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇందులో 70 % మహిళలే ఉండటం గమనార్హం. కాగా ఈ సమయంలోనే ఒక ఐడియా వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి బయటపడేసింది. అదేంటంటే..

హస్తకళాకారుల ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమను ప్రమోట్ చేసేందుకు ‘ఇండియన్ హ్యాండ్‌మేడ్ కలెక్టివ్’ పేరిట నవంబర్ 2020లో ఒక ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఈ ఇండియన్ హ్యండ్లూమ్ కలెక్టివ్‌కు ‘నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించిన మాలిని కుమార్ సపోర్ట్ చేసింది. ఆమె తన భర్త లక్ష్మీపతితో కలిసి భారత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించింది. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనగా ప్రొడక్ట్స్ సెల్లింగ్‌తో వచ్చిన లాభాలు తమ కోసం కాకుండా సంస్థ లక్ష్యాల కోసం ఉపయోగించడంతో పాటు హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు మొదట ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నారు. అయితే పోస్ట్ లాక్‌డౌన్ తర్వాత కూడా కస్టమర్లు వచ్చే పరిస్థితి లేకపోవడమే కాక అప్పుడు ఈ ఉత్పత్తులకు డిమాండ్ కూడా తక్కువగానే ఉండింది. ఈ సమయంలోనే ఈ-కామర్స్ పోర్టల్ చేయడంతో తమ ప్రొడక్ట్స్ కస్టమర్లకు ఈజీగా రీచ్ అయ్యాయని మాలిని తెలిపింది.

చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించే చెన్నైలోని ‘తుల’ స్టోర్ కూడా ఇండియన్ హ్యాండ్‌మేడ్ కలెక్టివ్‌తో టై‌అప్ అయింది. ఇప్పుడు 1,000 రకాల బ్రాండ్ ఉత్పత్తులు తయారు చేస్తూ 5 వేల మంది నేతకార్మికులకు ఈ-కామర్స్ పోర్టల్ ఉపాధినిస్తోంది. ఈ ఉత్పత్తులను కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నేత కార్మికులు తయారు చేస్తున్నారు. గోధుమ రంగులో ఉండే పత్తి ద్వారా చేతితో నూలు తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా సుస్థిరమైన, పర్యావరణ హితమైన ఉత్పత్తి. ధర్మపురి నాన్ ప్రాఫిట్ సంస్థ కూడా ఈ హ్యండ్లూమ్ కలెక్టివ్‌లో భాగమైంది. ఇక్కడ లంబాడి మహిళా నేత కళాకారులు నూతనంగా నూలు వడుకుతారు. ఎంబ్రాయిడరీ స్టైల్ డిఫరెంట్‌గా ఉండటంతో పాటు వస్త్రంపై కాయిన్స్, అద్దాలు అల్లడంలో వీళ్ల ప్రావీణ్యతకు అద్దం పడుతుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను నటి రేవతి నవంబర్ 27న ప్రారంభించింది. ఇలా సంక్షోభంలోనూ ఓ ఐడియా సక్సెస్ తెచ్చిపెట్టింది. వస్త్రపరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపి లాభాల బాటలోకి వెళ్లేందుకు దోహదపడింది.

Tags:    

Similar News