సంగారెడ్డిలో పంచాయతీ కార్యదర్శుల ధర్నా
దిశ, సంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలంటూ పంచాయతీ కార్యదర్శులు సంగారెడ్డిలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. తమకు 9 గంటలు మాత్రమే పనివేళలు కల్పించాలని, ఆదివారం విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శులందరికీ ఉపాధిహామీ అదనపు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్ కార్డులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అందేలా చూడాలని కోరారు. అకారణంగా సస్పెండ్ అయిన పంచాయతీ […]
దిశ, సంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలంటూ పంచాయతీ కార్యదర్శులు సంగారెడ్డిలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. తమకు 9 గంటలు మాత్రమే పనివేళలు కల్పించాలని, ఆదివారం విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్యదర్శులందరికీ ఉపాధిహామీ అదనపు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు హెల్త్ కార్డులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ అందేలా చూడాలని కోరారు. అకారణంగా సస్పెండ్ అయిన పంచాయతీ కార్యదర్శులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల దగ్గరికి వచ్చిన డీపీఓ వెంకటేశ్వర్ రావుకు తమ సమస్యల మెమోరాండాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.