సూసైడ్ నోట్ రాసి.. పంచాయతీ సెక్రటరీ ఆత్మహత్య..

దిశ, వెబ్ డెస్క్ : సర్పంచ్, అధికారుల వేధింపులు భరించలేక ఓ జూనియర్ పంచాయతీ సెక్రటరీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డిజిల్లాలోని పుల్కల్ మండలం మిన్పూర్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలో జగన్నాథ్ అనే యువకుడు పుల్కల్ విలేజ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విధుల్లో తనకు గ్రామ సర్పంచ్, అధికారులు తనకు తగిన గౌరవం, మర్యాద ఇవ్వడం లేదంటూ.. తాను చేసిన పనులను గుర్తించపోగా వేధిస్తున్నట్టు సూసైడ్ […]

Update: 2021-03-17 09:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : సర్పంచ్, అధికారుల వేధింపులు భరించలేక ఓ జూనియర్ పంచాయతీ సెక్రటరీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డిజిల్లాలోని పుల్కల్ మండలం మిన్పూర్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలో జగన్నాథ్ అనే యువకుడు పుల్కల్ విలేజ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే విధుల్లో తనకు గ్రామ సర్పంచ్, అధికారులు తనకు తగిన గౌరవం, మర్యాద ఇవ్వడం లేదంటూ.. తాను చేసిన పనులను గుర్తించపోగా వేధిస్తున్నట్టు సూసైడ్ నోట్‌లో తెలిపాడు. చిల్లర రాజకీయాలు, బిల్లులు ఇవ్వకపోవడమే తన చావుకు కారణం అంటూ లేఖలో పేర్కొన్నాడు. తన చావును మిగతా పంచాయతీ సెక్రటరీలందరూ.. ఏదైనా వారి సమస్య కోసం వాడుకోండి అంటూ లేఖలో తెలిపారు. నా కుటుంబానికి అప్పులు చాలా ఉన్నాయి, తలా ఓ చేయి వేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. అదే సమయంలో తన తల్లిదండ్రులను క్షమించమని వేడుకున్నాడు. చివరగా తనకు బతకాలని ఉందనీ.. ఇలా బ్రతకడం నా వళ్ల కాదని పేర్కొన్నాడు.

 

Tags:    

Similar News