వేసవిలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్‌ మరింత పెరుగుతుంది : పానాసోనిక్

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం మొదలవడం, డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ గృహోపకరణాల సంస్థ పానాసోనిక్ గడిచిన 3-4 నెలల్లో ఎయిర్ కండీషనర్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. ఈ వృద్ధి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఇటీవల పెరిగిన డిమాండ్ ధోరణి కొనసాగుతుందని నమ్ముతున్నాం. మార్చి త్రైమాసికంలో 100 శాతం కంటే అధిక వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్లలో 30 శాతం వృద్ధిని సాధించాలని […]

Update: 2021-04-04 08:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: వేసవి కాలం మొదలవడం, డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ గృహోపకరణాల సంస్థ పానాసోనిక్ గడిచిన 3-4 నెలల్లో ఎయిర్ కండీషనర్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. ఈ వృద్ధి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఇటీవల పెరిగిన డిమాండ్ ధోరణి కొనసాగుతుందని నమ్ముతున్నాం. మార్చి త్రైమాసికంలో 100 శాతం కంటే అధిక వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్లలో 30 శాతం వృద్ధిని సాధించాలని భావిస్తున్నామని’ పానాసోనిక్ ఇండియా ప్రెసిండెట్, సీఈఓ మనీష్ శర్మ చెప్పారు.

ఇటీవల పానాసోనిక్ ఇండియా ఏసీ ధరలను 6-8 శాతం పరిధిలో పెంచాలని నిర్ణయించగా, రిఫ్రిజిరేటర్ల ధరలను 3-4 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన మారిందని, భద్రత, సౌకర్యాన్ని బట్టి గృహోపకరణాలను కొంటున్నారని మనీష్ శర్మ పేర్కొన్నారు. ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ కారణంగా గతేడాది డిమాండ్ మరింత పెరుగుతోంది. క్యాష్‌బ్యాక్, ఈఎంఐ, ఈజీ యాక్సెసిబిలిటీలతో గృహోపకరణాలను కొనేవారు పెరుగుతూనే ఉన్నారని మనీష్ శర్మ వివరించారు. సరఫరా సామర్థ్యాలను మెరుగుపరచడం, దిగుమతి పరిమితులు, స్థానిక తయారీ అభివృద్ధి పరిణామాలతో పరిశ్రమలో ‘విడిభాగాల కొరత’ తాత్కాలిక సమస్య మాత్రమే అవనుంది. దీనికి తోడు గ్రామీణ, పట్టణ వినియోగదారుల్లో ఏసీ, రిఫ్రిజిరేటర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం కలిసొచ్చే అంశమని మనీష్ శర్మ వెల్లడించారు.

Tags:    

Similar News