అమెరికా కంపెనీతో కలిసి పనాసియా కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొనేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్న వేళ, ఇండియాకు చెందిన కంపెనీలు మిగిలిన దేశాల కంటే ముందున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అమెరికాకు చెందిన రెఫానా కంపెనీతో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించింది. ఏడాదిలో సుమారు 50 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు తయారు చేసే లక్ష్యంతో రెండు కంపెనీలు పని చేయనున్నాయి. 2021 […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌కు విరుగుడు కనుగొనేందుకు అనేక కంపెనీలు ప్రయత్నిస్తున్న వేళ, ఇండియాకు చెందిన కంపెనీలు మిగిలిన దేశాల కంటే ముందున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసేందుకు అమెరికాకు చెందిన రెఫానా కంపెనీతో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించింది. ఏడాదిలో సుమారు 50 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు తయారు చేసే లక్ష్యంతో రెండు కంపెనీలు పని చేయనున్నాయి. 2021 తొలి నాళ్లలో సుమారు 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన ఫైలింగ్‌లో పనాసియా బయోటెక్ పేర్కొంది. ఈ ప్రకటన అనంతరం స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పనాసియా బయోటెక్ కంపెనీ షేర్లు 20 శాతం పెరిగాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులలో పనాసియా ఒకటి. సంస్థ డబ్ల్యూహెచ్‌వో అర్హత కలిగిన టీకాలను ఈ కంపెనీ విక్రయిస్తుంది. పనాసియాతో పాటు దేశీయ ప్రముఖ వ్యాక్సిన్ తయరీ కంపెనీ సీరం సైతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనట్టు సీరం సీఈవో అడార్ పూనావాలా వెల్లడించారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న పలు దేశాల బయోటెక్‌లు, పరిశోధనా సంస్థలు అత్యధిక వ్యాక్సిన్ తయారీ సామర్థ్యం కలిగిన భారతీయ కంపెనీలను ఆశ్రయిస్తుండటం గమనార్హం.