విధి వికృతిలో పల్లె ప్రకృతి వనం.. పట్టించుకోరా..?
దిశ, నల్లగొండ : జిల్లాలోని కనగల్ మండలం బోయినపల్లి పల్లె పకృతి వనం వాగు నీటి ఉధృతికి శుక్రవారం మరోసారి నీటమునిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాటిని మొక్కలు నీటిపాలవుతున్నాయని గ్రామస్తులు ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీపీఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, సర్పంచ్ నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై తగు చర్య తీసుకుని పల్లె […]
దిశ, నల్లగొండ : జిల్లాలోని కనగల్ మండలం బోయినపల్లి పల్లె పకృతి వనం వాగు నీటి ఉధృతికి శుక్రవారం మరోసారి నీటమునిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాటిని మొక్కలు నీటిపాలవుతున్నాయని గ్రామస్తులు ఆందోళనల వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీపీఓకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారులు, సర్పంచ్ నిర్లక్ష్యంతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై తగు చర్య తీసుకుని పల్లె పకృతి వనం, ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామ సెంటర్లో నిర్మాణం చేపట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ డిమాండ్ చేస్తున్నారు.