అయ్యో పాపం.. మంత్రి చేసిన పనికి పగలబడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మంత్రి చేసిన పనికి అందరూ నవ్వుకుంటున్నారు. ఆయన అసలు మంత్రేనా అంటూ జోకులు పేలుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారా. మాల్స్, షాపింగ్ క్లాంపెక్స్ ఓపెనింగ్‌లకు సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలను పిలుస్తుంటారు. వాళ్లు ఆ కార్యక్రమానికి వస్తున్నారు అంటే.. నిర్వాహకులు వారికి ఏ లోటు లేకుండా జాగ్రత్త పడతారు. అయితే ఓ ఈవెంట్‌ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు కారణంగా మంత్రి షాపు ఓపనింగ్‌ను కత్తితో గాక […]

Update: 2021-09-03 11:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ మంత్రి చేసిన పనికి అందరూ నవ్వుకుంటున్నారు. ఆయన అసలు మంత్రేనా అంటూ జోకులు పేలుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారా. మాల్స్, షాపింగ్ క్లాంపెక్స్ ఓపెనింగ్‌లకు సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలను పిలుస్తుంటారు. వాళ్లు ఆ కార్యక్రమానికి వస్తున్నారు అంటే.. నిర్వాహకులు వారికి ఏ లోటు లేకుండా జాగ్రత్త పడతారు.

అయితే ఓ ఈవెంట్‌ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు కారణంగా మంత్రి షాపు ఓపనింగ్‌ను కత్తితో గాక తన పళ్లతో కొరికి కట్‌ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ పడిపడి నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.. మరో పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. పాక్ జైళ్ల శాఖ మంత్రి ఫయాజ్-ఉల్-హసన్ చోహన్‌.. సెప్టెంబర్ 2న రావల్పిండి నియోజకవర్గంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ఆయనకు రిబ్బన్ కట్ చేసేందుకు ఇచ్చిన కత్తెర సరిగా కట్‌ కాలేదు.

అది తుప్పు పట్టిపోవడంతో ఎన్నిసార్లు కట్‌ చేయాలని ప్రయత్నించినా ఆ రిబ్బన్ కట్ అవలేదు. దీంతో చేసేందేమీ లేక సదరు మంత్రి తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News