పాకిస్తాన్ లో పరమత సహనం.. ఆయనేం చేశాడంటే?

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ లో ఒక వింత సంఘటన జరిగింది. ఎప్పుడూ మైనారిటీల మీద దాడులు చేయడం కోర్టులకు వెళ్లడం అక్కడ నిర్దోషులు గా బయటకు రావడం షరా మామూలే. అయితే అన్ని చోట్లా మానవత్వం పరమత సహనం ఉంటుందని నిరూపించాడు ఆ దేశ న్యాయ మూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ . పాక్ లో జరుగుతున్న మైనారిటీ దాడులను ఖండించాడు. అంతే కాకుండా న్యాయస్థానాలు అందరి లాగే మైనారీటీలకు అండగా ఉంటుందని అన్నారు. […]

Update: 2021-11-10 00:36 GMT

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ లో ఒక వింత సంఘటన జరిగింది. ఎప్పుడూ మైనారిటీల మీద దాడులు చేయడం కోర్టులకు వెళ్లడం అక్కడ నిర్దోషులు గా బయటకు రావడం షరా మామూలే. అయితే అన్ని చోట్లా మానవత్వం పరమత సహనం ఉంటుందని నిరూపించాడు ఆ దేశ న్యాయ మూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ . పాక్ లో జరుగుతున్న మైనారిటీ దాడులను ఖండించాడు. అంతే కాకుండా న్యాయస్థానాలు అందరి లాగే మైనారీటీలకు అండగా ఉంటుందని అన్నారు. ఇక కరాక్ జిల్లాలోని తేరి గ్రామంలో పరమ హన్స్ జీ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన పై సీజే గుల్జార్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రభుత్వానికి గుడిని బాగు చేయాలని ఉత్తర్వులు జారీ చేశాడు. గుడిని నిర్మించేందుకు అయిన ఖర్చును నిందితుల నుంచే రాబట్టాలని ఆర్డర్ పాస్ చేశాడు.

ఇక దీపావళి నాటికి గుడి నిర్మాణం పూర్తి కావడంతో స్థానిక హిందువులతో కలిసి దేవాలయాన్ని ప్రారంభించారు. అందరితో కలిసి పండుగ జరుపుకున్నారు. పాకిస్తాన్ సుప్రీం కోర్టు అన్ని వేళలా మైనారిటీల హక్కులు కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను ఇచ్చిందని దాన్ని ఎవరు ఉపేక్షించినా సహించేది లేదన్నారు. మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, అలా చేసిన వారు ఎవరైనా సరే శిక్షార్హులని ప్రకటించారు.

Tags:    

Similar News