పెళ్లిలో సర్ప్రైజ్ ఇద్దామనుకున్న వధువు.. షాకైన అతిధులు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
దిశ, వెబ్డెస్క్ : పెళ్లి వేడుకను ప్రజెంట్ జనరేషన్ కపుల్స్ డిఫరెంట్గా జరుపుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ ఆలోచించనంత వినూత్నంగా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ వేడుక ఉండాలనుకుంటారు. ఈ విధంగా ఆలోచించిన ఓ వధువు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వెడ్డింగ్సెలబ్రేషన్లో వధువు అందరినీ ఆకట్టుకోవాలనుకున్న వధువుకు చేదు అనుభవం ఎదురైంది. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. పాకిస్థాన్లో ఓ కొత్త పెళ్లి […]
దిశ, వెబ్డెస్క్ : పెళ్లి వేడుకను ప్రజెంట్ జనరేషన్ కపుల్స్ డిఫరెంట్గా జరుపుకోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎవ్వరూ ఆలోచించనంత వినూత్నంగా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆ వేడుక ఉండాలనుకుంటారు. ఈ విధంగా ఆలోచించిన ఓ వధువు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వెడ్డింగ్సెలబ్రేషన్లో వధువు అందరినీ ఆకట్టుకోవాలనుకున్న వధువుకు చేదు అనుభవం ఎదురైంది.
ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. పాకిస్థాన్లో ఓ కొత్త పెళ్లి జంట తమ వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవాలనుకుంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేయాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే వధువు 100 కేజీల పొడవాటి లెహెంగా ధరించి తళుక్కున్న మెరిసింది. విలువైన బంగారు నగలు అలంకరించుకుంది. వరుడు బంగారం రంగు షేర్వాణీ ధరించాడు. కానీ ఆ వేడుకలో పాల్గొన్న వారి కళ్లన్నీ ఆ లెహెంగా మీదే ఉండటం విశేషం.
అయితే ఈ ఫోటో చూసిన నెటిజన్లు డిఫరెంట్గా కామెంట్స్ చేస్తున్నారు. డబ్బులన్నీ వృథా అంటూ పలువురు కామెంట్ చేశారు. ఆ లెహెంగా ధరించి కొన్ని అడుగులు వేస్తేనే వధువు అలసిపోతుందని మరో యూజర్ఎద్దేవా చేశాడు. ‘అతిథులకు రెడ్ కార్పెట్ వేస్తారు. కానీ ఇక్కడ లెహెంగానే రెడ్ కార్పెట్లా ఉంది కదా’.. అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు.
https://twitter.com/Pagal_aurat/status/1421144990437175297?s=20