పాక్ డైరెక్టర్ ‘మహాభారతం’ తీస్తున్న ఫీలింగ్ : హీరామండిపై నటి

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ.. పాకిస్థాన్, లాహోర్‌లోని రెడ్ లైట్ జిల్లాకు చెందిన అన్‌టోల్డ్ స్టోరీస్‌ను ‘హీరామండి’ మెగా సిరీస్ ద్వారా రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. దీనిపై పాకిస్థాన్ నటి ఉష్నా షా అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాతృదేశానికి సంబంధించిన హిస్టారిక్ ప్రావిన్స్‌పై ఒక ఇండియన్ డైరెక్టర్ వెబ్ సిరీస్ తీయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన ఉష్నా.. […]

Update: 2021-10-04 08:30 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ.. పాకిస్థాన్, లాహోర్‌లోని రెడ్ లైట్ జిల్లాకు చెందిన అన్‌టోల్డ్ స్టోరీస్‌ను ‘హీరామండి’ మెగా సిరీస్ ద్వారా రివీల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్‌ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. దీనిపై పాకిస్థాన్ నటి ఉష్నా షా అసంతృప్తి వ్యక్తం చేసింది. తన మాతృదేశానికి సంబంధించిన హిస్టారిక్ ప్రావిన్స్‌పై ఒక ఇండియన్ డైరెక్టర్ వెబ్ సిరీస్ తీయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన ఉష్నా.. ‘హీరామండి లాహోర్‌లో ఉంది, లాహోర్ పాకిస్తాన్‌లో ఉంది. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన ఈ ప్రాంతంపై పాకిస్థాన్ చరిత్ర ఉంది. నిజం చెప్పాలంటే ఒక పాకిస్థానీ దర్శకుడు మహాభారతాన్ని తెరకెక్కించినట్లుగా ఉంటుంది’ అని భన్సాలీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇది మీ చరిత్ర కాదు, దీన్ని అనుకరించడం వల్ల ప్రాజెక్ట్ ప్రామాణికతను కోల్పోతుంది. అయినా భారత్‌లోని గొప్ప సంస్కృతిని సినిమాగా తీయొచ్చు కదా? అని ప్రశ్నించింది.

Tags:    

Similar News