టీ20 వరల్డ్ కప్: న్యూజీలాండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ దూసుకుపోతోంది. భారత్‌పై జరిగిన తొలిమ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో గెలుపొందిన పాక్.. అదే ఉత్సాహాన్ని కనబరుస్తూ న్యూజీలాండ్‌ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ అనుకున్న ప్రకారం కివీస్ జట్టును కట్టడి చేసింది. పాక్ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో న్యూజీలాండ్ 134 పరుగులు మాత్రమే చేసింది. 135 పరుగుల స్వల్ప […]
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ దూసుకుపోతోంది. భారత్‌పై జరిగిన తొలిమ్యాచ్‌లో 10 వికెట్ల భారీ తేడాతో గెలుపొందిన పాక్.. అదే ఉత్సాహాన్ని కనబరుస్తూ న్యూజీలాండ్‌ను చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్ అనుకున్న ప్రకారం కివీస్ జట్టును కట్టడి చేసింది. పాక్ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో న్యూజీలాండ్ 134 పరుగులు మాత్రమే చేసింది.
135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు న్యూజీలాండ్ బౌలర్లు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు విజయం మాత్రం వారి పక్షానే నిలిచింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ 20 వరల్డ్ కప్‌లో కీలక జట్లపై పాక్ అధిపత్యాన్ని ప్రదర్శించింది.