పాక్ ప్రధానికి కరోనా టీకా.. మేడిన్ ఇన్ చైనా

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌‌డౌన్ విధించారు. తాజాగా దాయాది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పాక్ ప్రధాని స్వతహాగా తన నివాసంలోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు జాతీయ ఆరోగ్య శాఖ విభాగంలోని అతని ప్రత్యేక సహాయకదారు ట్వీట్ చేశారు. అంతేకాకుండా చైనా మేడ్ కరోనా […]

Update: 2021-03-20 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌‌డౌన్ విధించారు. తాజాగా దాయాది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పాక్ ప్రధాని స్వతహాగా తన నివాసంలోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు జాతీయ ఆరోగ్య శాఖ విభాగంలోని అతని ప్రత్యేక సహాయకదారు ట్వీట్ చేశారు.

అంతేకాకుండా చైనా మేడ్ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇమ్రాన్ సొంతంగా 1166 అనే హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం. తన వంతు రాగానే పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కరోనా టీకాను పాక్ ప్రధాని తీసుకున్నారు.

Tags:    

Similar News