పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ జట్టులో పాకిస్థాన్ మూడు మార్పులు చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా పొట్టి ప్రపంచ కప్ మరో వారంలో ప్రారంభం కానున్నది. ముందుగా రౌండ్ 1 మ్యాచ్‌లు ఒమన్‌లో నిర్వహిస్తుండగా.. ఆ తర్వాత సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈలో జరుగనున్నాయి. కాగా, ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి. వాటిలో తుది మార్పులు చేసుకోవడానికి అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది. ఈ అవకాశాన్ని […]
దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ జట్టులో పాకిస్థాన్ మూడు మార్పులు చేసింది. యూఏఈ, ఒమన్ వేదికగా పొట్టి ప్రపంచ కప్ మరో వారంలో ప్రారంభం కానున్నది. ముందుగా రౌండ్ 1 మ్యాచ్‌లు ఒమన్‌లో నిర్వహిస్తుండగా.. ఆ తర్వాత సూపర్ 12 మ్యాచ్‌లు యూఏఈలో జరుగనున్నాయి. కాగా, ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి. వాటిలో తుది మార్పులు చేసుకోవడానికి అక్టోబర్ 10 వరకు గడువు ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చేశారు. గతంలో ప్రకటించిన మహ్మద్ హుస్నేన్, అజమ్ ఖాన్ స్థానాల్లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలకు చోటు కల్పించారు. ఇక గతంలో ప్రకటించిన జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఫకర్ జమాన్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. ప్రధాన జట్టులోని కుష్దిల్ షాను ట్రావెల్ రిజర్వ్‌గా చేశారు. ఈ మేరకు పాకిస్థాన్ జాతీయ సెలెక్టర్ ముహమ్మద్ వాసిమ్ ప్రకటించారు. గత నెలలో ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్న షోయబ్ మక్సూద్‌ను జట్టులో చేర్చే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.