లావెక్కారని.. 140మందిని సిబ్బందిని విధుల్లోకి రానివ్వని ఎయిర్‌లైన్స్

దిశ, ఫీచర్స్ : మన దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది ఇళ్లకే పరిమితమైపోయారు. దాంతో వ్యాయామం చేయకుండా బద్ధకస్తులుగా మారి బరువు పెరిగారు. అదే ఇంగ్లాండ్‌లో అయితే ప్రతి ముగ్గురిలో ఇద్దరు 3నుంచి 5కిలోల వెయిట్ పుటాన్ అయినట్లు సర్వేలు వెల్లడించాయి. అయితే లావెక్కడం అనారోగ్యానికి దారితీయడమే కాదు ఉద్యోగానికి కూడా ముప్పే. ఎందుకంటే బరువెక్కారనే కారణంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఎ) 140 మంది ఫ్లైట్ అటెండెంట్లను విధుల్లోకి రానివ్వలేదు. అంతేకాదు వారి ప్రమోషన్లు కూడా […]

Update: 2021-06-28 01:00 GMT

దిశ, ఫీచర్స్ : మన దేశంలో లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది ఇళ్లకే పరిమితమైపోయారు. దాంతో వ్యాయామం చేయకుండా బద్ధకస్తులుగా మారి బరువు పెరిగారు. అదే ఇంగ్లాండ్‌లో అయితే ప్రతి ముగ్గురిలో ఇద్దరు 3నుంచి 5కిలోల వెయిట్ పుటాన్ అయినట్లు సర్వేలు వెల్లడించాయి. అయితే లావెక్కడం అనారోగ్యానికి దారితీయడమే కాదు ఉద్యోగానికి కూడా ముప్పే. ఎందుకంటే బరువెక్కారనే కారణంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పిఐఎ) 140 మంది ఫ్లైట్ అటెండెంట్లను విధుల్లోకి రానివ్వలేదు. అంతేకాదు వారి ప్రమోషన్లు కూడా ఆపేయడం గమనార్హం.

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విమానాయాన రంగంలోనూ చాలామంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. 2020లో దుబాయ్ ప్రభుత్వ రంగ విమానాయన సంస్థ ఎమిరెట్స్ 600 మంది పైలట్లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ రంగంలో ఇదే అతిపెద్ద తొలగింపుగా నిపుణులు పేర్కొన్నారు. అయితే తాజాగా పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా అధిక బరువు ఉన్న 140 మంది విమాన సిబ్బంది జూలై నెలకు సంబంధించిన ఫ్లైట్స్ డ్యూటీ రోస్టర్‌లో పేర్లు తొలగించగా, పదోన్నతుల జాబితాలోనూ వీళ్ల పేర్లు చేర్చలేదు. కరోనా నేపథ్యంలో విమాన సహాయకులు కఠినమైన డైట్ ప్లాన్‌ను అవలంబించకపోవటమే కారణం. కాగా ఈ కఠిన నిర్ణయం సడెన్‌గా తీసుకోలేదని పిఐఎ ప్రతినిధులు తెలిపారు. ఇంతకు ముందు పలుమార్లు ఈ అధిక బరువున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశామని, అయినా ఎటువంటి మార్పూ రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Tags:    

Similar News