కరోనాతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మృతి

కరోనా మహమ్మారి పాకిస్తాన్‌లోనూ తన పంజా విసురుతోంది. అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతూనే ఉంది. గత వారం కరోనా బారిన పడి మాజీ స్క్వాష్ ప్లేయర్ అజామ్ ఖాన్ మృతి చెందగా.. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ మృతి చెందారు. 1988-94 మధ్య కాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన జాఫర్ సర్ఫరాజ్ (50) ఈ నెల 7న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆయనకు […]

Update: 2020-04-14 08:14 GMT

కరోనా మహమ్మారి పాకిస్తాన్‌లోనూ తన పంజా విసురుతోంది. అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోజురోజుకూ దాని తీవ్రత పెరుగుతూనే ఉంది. గత వారం కరోనా బారిన పడి మాజీ స్క్వాష్ ప్లేయర్ అజామ్ ఖాన్ మృతి చెందగా.. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ మృతి చెందారు. 1988-94 మధ్య కాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన జాఫర్ సర్ఫరాజ్ (50) ఈ నెల 7న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో మంగళవారం తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతికి పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన జాఫర్ తన కెరీర్‌లో 15 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 616 పరుగులు చేశారు. 1994లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ఆయన కోచ్‌గా కెరీర్ ప్రారంభించాడు. అతని సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా క్రికెటరే. ఆయన పాకిస్తాన్ తరపున నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్‌లో 5 వేల మందికి పైగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా, 96 మంది మృతి చెందారు.

Tags: Pakistan, Cricketer, Jafer, Corona, died

Tags:    

Similar News