దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభించనున్న పీసీబీ

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆరు జట్లతో కూడిన దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి జాతీయ టీ20 కప్ (National T20 Cup) నిర్వహిస్తామని, తొలి రౌండ్ ముల్తాన్‌లో ప్రారంభం కానుండగా.. చివరి రౌండ్ రావల్పిండిలో జరుగుతాయని పీసీబీ (PCB) ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు అసోసియేషన్ల పరిధిలో పలువురు క్రికెటర్లకు దేశవాళీ కాంట్రాక్టులు అందిస్తామని, 1 ఆగస్టు 2020 నుంచి 31జులై 2021 వరకు ఈ […]

Update: 2020-08-28 09:18 GMT

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆరు జట్లతో కూడిన దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి జాతీయ టీ20 కప్ (National T20 Cup) నిర్వహిస్తామని, తొలి రౌండ్ ముల్తాన్‌లో ప్రారంభం కానుండగా.. చివరి రౌండ్ రావల్పిండిలో జరుగుతాయని పీసీబీ (PCB) ఒక ప్రకటనలో తెలిపింది.

ఆరు అసోసియేషన్ల పరిధిలో పలువురు క్రికెటర్లకు దేశవాళీ కాంట్రాక్టులు అందిస్తామని, 1 ఆగస్టు 2020 నుంచి 31జులై 2021 వరకు ఈ కాంట్రాక్టు గడువు ఉంటుందని పేర్కొన్నది. ఆరు ప్రావిన్సుల క్రికెట్ అసోసియేషన్ కోచ్‌లే క్రికెటర్లను ఎంపిక చేయనున్నారు. గత రెండేళ్ల ప్రతిభ ఆధారంగా క్రికెటర్ల ఎంపిక ఉంటుంది.

అయితే 2019-20 సీజన్‌లో ఆడిన 158 మంది క్రికెటర్లను ఈ ఏడాదికి కూడా కొనసాగించనున్నారు. వీరితో పాటు కొత్తగా ఎంపికైన 34 మంది క్రికెటర్లకు కాంట్రాక్టులు లభించనున్నాయి. ప్రతీ జట్టులో 45 మంది ఎంపిక కాగా, వీరిలో 32 మందికి దేశవాళీ కాంట్రాక్టు లభించనుంది. ప్రతీ అసోసియేషన్ కోచ్ ఈ 45 మంది నుంచే జాతీయ టీ20 కప్, ఖైద్ ఏ అజామ్ ట్రోఫీ, పాకిస్తాన్ కప్ వన్డే టోర్నమెంట్‌కు ఎంపిక చేయాల్సి ఉంది. గత ఏడాది అండర్ 19 ప్రపంచ కప్ ఆడిన 11 మంది క్రికెటర్లకు కూడా దేశవాళీ కాంట్రాక్టు దక్కింది.

Tags:    

Similar News