తాలిబాన్ల దగ్గరికి ఇమ్రాన్.. శాంతి చర్చలకేనా ?

దిశ, వెబ్ డెస్క్ ; ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తాలిబాన్లతో శాంతి చర్చలకు ముందుకు వెళ్తోంది. ఇంతకాలంగా పాక్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ భద్రత దళాలు, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిన తాలిబాన్లను తన దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఎట్టకేలకు మొదలు పెట్టింది. అయితే పాకిస్తాన్ అడ్డాగా మార్చుకుని తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ గా చలామణీ అవుతోంది. 14 ఏళ్లు గా పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను సాగిస్తూ సామాన్యుల జీవితాలకు […]

Update: 2021-11-09 22:09 GMT

దిశ, వెబ్ డెస్క్ ; ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తాలిబాన్లతో శాంతి చర్చలకు ముందుకు వెళ్తోంది. ఇంతకాలంగా పాక్ ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ భద్రత దళాలు, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిన తాలిబాన్లను తన దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఎట్టకేలకు మొదలు పెట్టింది. అయితే పాకిస్తాన్ అడ్డాగా మార్చుకుని తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ గా చలామణీ అవుతోంది. 14 ఏళ్లు గా పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను సాగిస్తూ సామాన్యుల జీవితాలకు ఎన్నో ఆటంకాలను కల్పించింది. అయితే ఇప్పటికి పాక్ ప్రభుత్వానికి చర్చలు అనే మాట గుర్తుకు వచ్చింది. కానీ ఇది మీరు అనుకున్నట్టు ఆఫ్ఘన్ లో ఉన్న తాలిబాన్ సంస్థకాదు . పాకిస్తాన్ లోనే ఆ పేరుతో ఒక ఉగ్రమూక పని చేస్తోంది.

తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) తో చర్చలు జరపడానికి ఆఫ్ఘన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని పాక్ ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి ప్రకటించారు. నెల రోజుల్లో మా చర్చలు ఒక కొలిక్కి వస్తాయని అప్పటి వరకూ కాల్పుల విరమణ పాటిస్తామని టీటీపీ ప్రతినిధి మొహమ్మద్ ఖురాసానీ తెలిపారు. ఇరువురి నడుమ చర్చలకు ఆఫ్ఘన్ ప్రభుత్వం సాకారానికి ధన్యవాదాలు తెలిపాడు.

అయితే ఈ కాల్పుల విరమణ కేవలం డిసెంబర్ 9 వరకే ఉంటుందని చర్చలు సఫలం అయితేనే ఆ తర్వాత కొనసాగుతాయని టీటీపీ తెలిపింది. ఈ టీటీపీ కూడా ఆఫ్ఘన్ లో ఉన్న తాలిబాన్ల తోక సంస్థే. 2007 లో కొంత మంది పాక్ ఉగ్రవాదుల సహాయంతో మొదలైన ఈ సంస్థ, తర్వాత ఎన్నో మారణ హోమాలను సృష్టించి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ఇమ్రాన్ ప్రభుత్వం రాకముందు వరకూ ఈ సంస్థ పై నిషేదం ఉండేది. తర్వత వచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది.

Tags:    

Similar News