భారత్‌లోనే ఫిక్సింగ్ మాఫియా : పాక్ మాజీ పేసర్

క్రికెట్ ఓ జెంటిల్‌మెన్ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా ఆటకు ఎంతటి పాపులారిటీ ఉంటుందో, వివాదాలూ అంతేస్థాయిలో ఉంటాయి. తరచూ వినిపించే మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఆటను మసకబారుస్తుంటాయి. క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు బయటపడ్డాయి. చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్లను కోల్పోవలసి వచ్చింది. ఇండియాలో పాపులరైన ఐపీఎల్‌ లీగ్‌ను సైతం మ్యాచ్ ఫిక్సింగ్‌ వదల్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ ‘మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇం‌డియానే భారీ అడ్డా’ […]

Update: 2020-05-07 07:21 GMT

క్రికెట్ ఓ జెంటిల్‌మెన్ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా ఆటకు ఎంతటి పాపులారిటీ ఉంటుందో, వివాదాలూ అంతేస్థాయిలో ఉంటాయి. తరచూ వినిపించే మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఆటను మసకబారుస్తుంటాయి. క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు బయటపడ్డాయి. చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్లను కోల్పోవలసి వచ్చింది. ఇండియాలో పాపులరైన ఐపీఎల్‌ లీగ్‌ను సైతం మ్యాచ్ ఫిక్సింగ్‌ వదల్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ ‘మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఇం‌డియానే భారీ అడ్డా’ అని సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను గమనిస్తే ఫిక్సింగ్ మాఫియా భారత్‌లోనే ఉందనే విషయం తెలుస్తుందని చెప్పాడు. అంతేకాకుండా ఫిక్సింగ్ మాఫియాలోకి ఏ ఆటగాడైనా ఒక్కసారి అడుగు పెట్టాడంటే తిరిగి బయటపడాలన్నా కష్టమని చెప్పాడు.

అయితే ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు జీవితకాల నిషేధం విధించడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. కాగా, పాకిస్తాన్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన మహ్మద్ ఆమిర్ లాంటి ఆటగాళ్లకు పాక్ క్రికెట్ బోర్డు తిరిగి జట్టులో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై జావెద్ స్పందిస్తూ.. ఇలాంటి చర్యల వల్ల మరింతమంది ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుందని అన్నాడు. కాగా, 1992లో ప్రపంచ కప్ ‌జట్టులో ఉన్న తాను క్రికెట్‌ నుంచి కనుమరుగయ్యేందుకు ఫిక్సింగ్‌ను వ్యతిరేకించడమే కారణమని అకీబ్ వెల్లడించాడు.

Tags: Match fixing, India, IPL, Pakistan, Akib Javed

Tags:    

Similar News