కోహ్లీకి మద్దతుగా నిలిచిన పాక్ క్రికెటర్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టైటిల్స్ గెలవలేక పోతున్న విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బదులు కొత్త కెప్టెన్‌ను నియమిస్తే ప్రపంచ కప్ గెలుస్తుందని హామీ ఉందా అని అక్మల్ ప్రశ్నించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ టీమ్ ఇండియాను నడిపించాడు. కానీ ఆ మూడు […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ టైటిల్స్ గెలవలేక పోతున్న విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బదులు కొత్త కెప్టెన్‌ను నియమిస్తే ప్రపంచ కప్ గెలుస్తుందని హామీ ఉందా అని అక్మల్ ప్రశ్నించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ టీమ్ ఇండియాను నడిపించాడు. కానీ ఆ మూడు ఈవెంట్లలో కూడా భారత జట్టు ఓటమిపాలయ్యింది. దీంతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
‘విరాట్ గొప్ప క్రికెటర్. అతడు మైదానంలో ఎంతో దూకుడుగా కనిపిస్తాడు. అతడే జట్టుకు బలం. భారత జట్టుకు ఏ కెప్టెన్ వచ్చినా క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తాడు. సౌరవ్ గంగూలీ తర్వాత ద్రవిడ్, ధోనీ జట్టుకు ఎంతో చేశారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వారి బాటలోనే నడుస్తున్నాడు. ఐసీసీ టైటిల్స్ గెలవనంత మాత్రాన అతడు తక్కువేం కాదు. అవి తప్ప అన్నీ సాధించాడు’ అని అక్మల్ చెప్పుకొచ్చాడు. భారత జట్టు టైటిల్స్ గెలవక పోవడం కోహ్లీ తప్పు కాదు. జట్టంతా కలసి దీనిపై విశ్లేషించుకోవాలని కమ్రాన్ సలహా ఇచ్చాడు.