రేవంత్ రెడ్డి డిపాజిట్ దక్కించుకో.. పాడి కౌశిక్ రెడ్డి సవాల్
దిశ , హుజూరాబాద్: సత్తా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కించుకోవాలని టీపీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు కోట్లాది రూపాయలు ఇచ్చి […]
దిశ , హుజూరాబాద్: సత్తా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కించుకోవాలని టీపీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు కోట్లాది రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. ఈటలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీల్లోకి వెళ్లినా ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతోందన్నారు. ఈటలకు ఆస్తులు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో లేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి నల్లా చట్టాలు తీసుకొచ్చిన బీజేపీకి ఓటు వేస్తారో లేక ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న టీఆర్ఎస్ అభ్యర్థికి వేస్తారో ఆలోచించుకోవాలన్నారు. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించినట్లయితే రెండేళ్లలో నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.