క్రికెట్‌కు వినయ్ కుమార్ రిటైర్మెంట్
బెంగళూరు: టీమ్ ఇండియా సీనియర్ పేసర్ వినయ్ కుమార్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు రెండు పేజీలతో కూడిన ఓ భావోద్వేగపూరిత లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘క్రికెట్ అనే జీవన ప్రయాణంలో 25 ఏళ్లపాటు ఎన్నో స్టేషన్లను దాటుతూ నడిచిన ‘‘దేవంగెరీ ఎక్స్‌ప్రెస్’’ నేడు రిటైర్మెంట్ అనే చివరి స్టేషన్‌కు చేరుకుంది. ఎన్నో ఉద్వేగ క్షణాల నడుమ అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నాను. కెరీర్‌లో అనిల్ కుంబ్లే, […]
బెంగళూరు: టీమ్ ఇండియా సీనియర్ పేసర్ వినయ్ కుమార్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు రెండు పేజీలతో కూడిన ఓ భావోద్వేగపూరిత లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘క్రికెట్ అనే జీవన ప్రయాణంలో 25 ఏళ్లపాటు ఎన్నో స్టేషన్లను దాటుతూ నడిచిన ‘‘దేవంగెరీ ఎక్స్‌ప్రెస్’’ నేడు రిటైర్మెంట్ అనే చివరి స్టేషన్‌కు చేరుకుంది. ఎన్నో ఉద్వేగ క్షణాల నడుమ అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నాను.
కెరీర్‌లో అనిల్ కుంబ్లే, ధోనీ, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్లతో ఆడటం ద్వారా నా క్రికెట్ అనుభవం సుసంపన్నమైంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. కాగా, కర్నాటకలోని దేవంగెరీ పట్టణానికి చెందిన రంగనాథ్ వినయ్ కుమార్, 2010 మే 11న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వన్డే, టెస్టు క్రికెట్‌లోకి ప్రవేశించాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఒక టెస్టు, 31 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లాడిన వినయ్, 49 వికెట్లు తీసుకున్నాడు. 2011లో ఢిల్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో 4/30తో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అలాగే, వందకుపైగా రంజీ మ్యాచ్‌లు ఆడిన వినయ్, తన ప్రదర్శనతో కర్నాటక జట్టుకు వరుసగా(2014-15) రెండు టైటిల్స్ అందించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, కొచ్చీ టస్కర్స్ కేరళ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.