900 వికెట్ల క్లబ్‌లో పేసర్ అండర్సన్
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన మైలురాయిని దాటాడు. ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానేను అవుట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో కలపి 900 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆ ఘనతను అండర్సన్ కంటే ముందు ఇద్దరు పేసర్లు మాత్రమే అందుకున్నారు. గ్లెన్ మెక్‌గ్రాత్ (954), వసీం అక్రమ్ (916) మాత్రమే అండర్సన్ కంటే ముందు ఉన్నారు. మొత్తంగా బౌలర్లలో ఈ మైలు రాయిని […]
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన మైలురాయిని దాటాడు. ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానేను అవుట్ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో కలపి 900 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆ ఘనతను అండర్సన్ కంటే ముందు ఇద్దరు పేసర్లు మాత్రమే అందుకున్నారు.
గ్లెన్ మెక్‌గ్రాత్ (954), వసీం అక్రమ్ (916) మాత్రమే అండర్సన్ కంటే ముందు ఉన్నారు. మొత్తంగా బౌలర్లలో ఈ మైలు రాయిని దాటిన వాళ్లలో ముత్తయ్య మురళీధరన్ (1347) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత షేన్ వార్న్ (1001), అనిల్ కుంబ్లే (954) ఉన్నారు. ఇప్పటి అండర్సన్ 160 టెస్టుల్లో 613 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీసుకున్నాడు.