భద్రాచలం ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్
దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా రోగులకి ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 18వ తేది మంగళవారం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. ఆ మేరకు ప్లాంట్ పనులు చకచకా చేస్తున్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి నాలుగు రాష్ట్రాల రోగులకు విశేష సేవలందిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, […]
దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం పరిసర ప్రాంత ప్రజలకు ఇది నిజంగా శుభవార్త. కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా రోగులకి ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 18వ తేది మంగళవారం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. ఆ మేరకు ప్లాంట్ పనులు చకచకా చేస్తున్నారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రి నాలుగు రాష్ట్రాల రోగులకు విశేష సేవలందిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు. కరోనా సెకండ్ వేవ్ కేసుల్లో ఎక్కువ రోగులు ఆక్సిజన్ తగ్గి ఊపిరాడక చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల రోగులకి సెంటర్ పాయింట్‌గా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పబ్లిక్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక కృషి వలన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది.