‘ఆక్స్‌ఫర్డ్ టీకా కోతుల్లో కొవిడ్‌ను నిలువరించింది’

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకాపై ఆశాజనక విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. ఊపిరితిత్తులపై ప్రభావం వేసే కొవిడ్ నిమోనియా(సార్స్-కొవ్-2 కాంప్లికేషన్)ను ఈ టీకా నిలువరించగలిగిందని జర్నల్ నేచర్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. వాటిలో వైరల్ లోడ్ తగ్గించిందని పేర్కొంది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌కు ఈ ఫలితాలు ఉపయోగపడ్డాయని వివరించింది. కోతులకు ఈ వైరస్‌ సోకడానికి 28 రోజుల ముందు సింగిల్ డోస్ ఇవ్వగా ఊపిరితిత్తులపై ప్రభావం వేయకుండా అడ్డుకుందని, వైరల్ లోడ్‌నూ నిలువరించిందని తెలిపింది. […]

Update: 2020-07-31 11:01 GMT

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న టీకాపై ఆశాజనక విషయాన్ని ఓ అధ్యయనం వెల్లడించింది. ఊపిరితిత్తులపై ప్రభావం వేసే కొవిడ్ నిమోనియా(సార్స్-కొవ్-2 కాంప్లికేషన్)ను ఈ టీకా నిలువరించగలిగిందని జర్నల్ నేచర్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

వాటిలో వైరల్ లోడ్ తగ్గించిందని పేర్కొంది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్‌కు ఈ ఫలితాలు ఉపయోగపడ్డాయని వివరించింది. కోతులకు ఈ వైరస్‌ సోకడానికి 28 రోజుల ముందు సింగిల్ డోస్ ఇవ్వగా ఊపిరితిత్తులపై ప్రభావం వేయకుండా అడ్డుకుందని, వైరల్ లోడ్‌నూ నిలువరించిందని తెలిపింది. అలాగే, 56 రోజులు, 28 రోజలకు ముందు రెండు డోస్‌లుగా ఇవ్వగా ఇమ్యూన్ రెస్పాన్‌కూడా కలిగిందని పేర్కొంది. అయితే, ఆక్స్‌ఫర్డ్ టీకా ముందస్తుగానే వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోవచ్చునని, అయితే, వ్యాధి తీవ్రతను తగ్గించగలుగుతుందని అధ్యయనం తెలిపింది.

Tags:    

Similar News