శుభవార్త చెప్పిన ఆక్స్‌ఫర్డ్.. కోతులపై కరోనా వ్యాక్సిన్ సక్సెస్

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి పలు దేశాలకు చెందిన పరిశోధకులు వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లను రూపొందించిన పరిశోధకులు మానవులపై కూడా ట్రయల్స్ చేస్తున్నారు. కాగా, గత మార్చి నెలలో తొలి సారిగా కోతులపై ట్రయల్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు బయటకు వచ్చాయి. కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఆరు […]

Update: 2020-04-29 07:45 GMT

లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి పలు దేశాలకు చెందిన పరిశోధకులు వాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయంలో ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లను రూపొందించిన పరిశోధకులు మానవులపై కూడా ట్రయల్స్ చేస్తున్నారు. కాగా, గత మార్చి నెలలో తొలి సారిగా కోతులపై ట్రయల్స్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు బయటకు వచ్చాయి. కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఆరు కోతులకు వ్యాక్సిన్ ఇవ్వగా.. 28 రోజుల తర్వాత కూడా అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని వారు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోతులను ఉపయోగించారు. మానవ కణజాలాలకు బాగా సారూప్యత కలిగిన కోతులు కొన్నింటికి వ్యాక్సిన్ ఇవ్వగా, మరి కొన్నింటికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. వీటన్నింటినీ కరోనా వైరస్ ప్రభావానికి గురి చేసినప్పుడు.. వ్యాక్సిన్ ఇచ్చిన ఆరు కోతులు ఆరోగ్యంగా ఉన్నాయి. కాని మిగతా కోతులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యాయని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించారు. వాటి ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయని చెప్పారు. కాగా, మే నెలాఖరుకు 6వేల మందిపై ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలన్నీ విజయవంతం అయితే సెప్టెంబర్ ఆఖరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కోతులపై జరిగిన ప్రయోగంతో వ్యాక్సిన్ రూపకల్పనలో ఎంతో పురోగతి సాధించినట్లేనని ఆక్స్‌ఫర్డ్ బృందం స్పష్టం చేసింది.

Tags : Oxford Scientists, Monkeys, Vaccine, Coronavirus, Trial, Success, London

Tags:    

Similar News