కరోనా కేసుల్లో రికార్డు.. ఒక్కరోజే లక్షకుపైగా

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా ప్రతాపం తారాస్థాయికి చేరుకుంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు గత రికార్డులను బద్ధలు కొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమెదవుతుండగా.. గత 24 గంటల్లో కూడా అదే జోరు కొనసాగింది. గడిచిన 24 గంటల్లో 1,15,736 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఏడాదిలో లక్షకుపైగా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.  కొత్తగా 630 మరణాలు నమోదవ్వగా.. 59,856 మంది కోలుకుని […]

Update: 2021-04-06 22:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా ప్రతాపం తారాస్థాయికి చేరుకుంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు గత రికార్డులను బద్ధలు కొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమెదవుతుండగా.. గత 24 గంటల్లో కూడా అదే జోరు కొనసాగింది.

గడిచిన 24 గంటల్లో 1,15,736 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఏడాదిలో లక్షకుపైగా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్తగా 630 మరణాలు నమోదవ్వగా.. 59,856 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం 8,43,473 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 1,17,92,135 మంది కోలుకున్నట్లు తెలిపింది.

ఇఫ్పటివరకు 1,66,177 మందిని కరోనా బలి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అటు ఇప్పటివరకు 8,70,77,474 మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News