మిథైల్ ఆల్కహాల్ తాగితే కరోనా తగ్గుతుందనుకున్నారు!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19కి కచ్చితంగా ఎలాంటి అధికారిక మందు లేదు. కానీ వైరస్ సోకకుండా ఉండటానికి ప్రజలు విపరీత పనులు చేస్తున్నారు. ఇరాన్‌లో కరోనా తగ్గిస్తుందేమోనన్న ఆలోచనతో మిథైల్ ఆల్కహాల్ తాగి దాదాపు 700 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాధి సోకి మరణించిన వారి కంటే ఇలా తప్పుడు మందులు చనిపోయిన వారే ఎక్కువ ఉన్నారని ఇరాన్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే మొదట ఈ మరణాలన్నిటినీ ఆల్కహాల్ పాయిజనింగ్‌గా వర్గీకరించారు. తర్వాత […]

Update: 2020-04-30 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19కి కచ్చితంగా ఎలాంటి అధికారిక మందు లేదు. కానీ వైరస్ సోకకుండా ఉండటానికి ప్రజలు విపరీత పనులు చేస్తున్నారు. ఇరాన్‌లో కరోనా తగ్గిస్తుందేమోనన్న ఆలోచనతో మిథైల్ ఆల్కహాల్ తాగి దాదాపు 700 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాధి సోకి మరణించిన వారి కంటే ఇలా తప్పుడు మందులు చనిపోయిన వారే ఎక్కువ ఉన్నారని ఇరాన్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అయితే మొదట ఈ మరణాలన్నిటినీ ఆల్కహాల్ పాయిజనింగ్‌గా వర్గీకరించారు. తర్వాత గత రెండు మూడు నెలల్లోనే ఈ మరణాల సంఖ్య ఎక్కువ ఉండటంతో మరోసారి విచారణ చేశారు. ఈ విచారణలో ఎక్కువ మంది కరోనాకు మందుగా మిథైల్ ఆల్కహాల్ తాగినవారేనని తేలినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కియానౌష్ జాహన్‌పుర్ వెల్లడించారు. అయితే మిథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్ ద్వారా 5011 మంది ప్రమాదంబారిన పడగా, వీరిలో 90 మంది మాత్రం దాని సైడ్ ఎఫెక్టు కంటి చూపు కోల్పోవడంతో బాధపడుతున్నారు. మొత్తం మధ్యప్రాచ్యంలోని దేశాల్లో ఇరాన్ కొవిడ్ 19 కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది.

Tags: corona, covid 19, Iran, Tehran, Mithyl Alcohol, Poison

Tags:    

Similar News