ఐఐటీ జోధ్‌పూర్‌లో 70 మందికి కరోనా
జైపూర్: రాజస్తాన్‌లో జోధ్‌పూర్ ఐఐటీ క్యాంపస్‌లో సుమారు 70 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని అధికారులు తెలిపారు. టెస్టుల సంఖ్యను పెంచామని, కాంటాక్టులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. మార్చి 11 నుంచి క్యాంపస్‌లో కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం మొత్త కేసులు సుమారుగా 70కి చేరాయని వివరించారు. డిప్యూటీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పి సింగ్ మాట్లాడుతూ, చండీగడ్, గుజరాత్, జైపూర్‌లలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు […]
జైపూర్: రాజస్తాన్‌లో జోధ్‌పూర్ ఐఐటీ క్యాంపస్‌లో సుమారు 70 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని అధికారులు తెలిపారు. టెస్టుల సంఖ్యను పెంచామని, కాంటాక్టులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నట్టు చెప్పారు. మార్చి 11 నుంచి క్యాంపస్‌లో కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం మొత్త కేసులు సుమారుగా 70కి చేరాయని వివరించారు. డిప్యూటీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పి సింగ్ మాట్లాడుతూ, చండీగడ్, గుజరాత్, జైపూర్‌లలోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు తొలుత కరోనా బారినపడ్డారని, వారి ద్వారా క్యాంపస్‌లోకి కరోనా ప్రవేశించి ఉండవచ్చని వివరించారు. ఐఐటీ జోధ్‌పూర్‌లో మొత్తం 65 నుంచి 70 కరోనా కేసులు ఉండవచ్చని, ప్రస్తుతం దాదాపు 55 నుంచి 60 యాక్టివ్ కేసులు ఉండవచ్చని చెప్పారు. సీరియస్ కేసులేమీ లేవని అన్నారు. క్యాంపస్‌లోని బ్లాక్ జీ3ని మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారని వివరించారు.