భారత్‌లో కరోనా విజృంభణ.. 26వేలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,990 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 49మరణాలు సంభవించాయి. దేశంలో ఒక్కరోజే ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవ్వడం, ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 26,496కు చేరగా, మృతుల సంఖ్య 824కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 68శాతం 27జిల్లాల నుంచే ఉన్నాయని తెలిపింది. అలాగే, […]

Update: 2020-04-26 01:01 GMT

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే రికార్డు స్థాయిలో 1,990 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 49మరణాలు సంభవించాయి. దేశంలో ఒక్కరోజే ఇన్ని పాజిటివ్ కేసులు నమోదవ్వడం, ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 26,496కు చేరగా, మృతుల సంఖ్య 824కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 68శాతం 27జిల్లాల నుంచే ఉన్నాయని తెలిపింది. అలాగే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,800మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారనీ, దీంతో గతవారం కోలుకున్న వారిశాతం 14.19గా ఉండగా, ఈ వారం 21.9కి పెరిగినట్టు వెల్లడించింది.

Tags: corona, virus, corona cases in india, corona deaths in india, covid 19, union health ministry

Tags:    

Similar News