ఢిల్లీలో మరో షహీన్‌బాగ్!
దిశ, వెబ్‌డెస్క్: పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలకు ప్రేరణగా నిలిచాయి. షహీన్‌బాగ్ తరహాలోనే జాతీయ జెండాలు, ఆజాద్ స్లోగన్‌లతో ప్రదర్శనలు జరిగాయి. తాజాగా, ఢిల్లీలోని జాఫ్రాబాద్ ఏరియాలో షహీన్‌బాగ్ ఆందోళనలను పోలిన నిరసనే శనివారం రాత్రి మొదలైంది. సుమారు ఐదు వందల మంది మహిళలు శనివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో కీలక రోడ్డు మార్గంపై సీఏఏ, ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఈ మహిళా ఆందోళనకారుల […]
దిశ, వెబ్‌డెస్క్: పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలకు ప్రేరణగా నిలిచాయి. షహీన్‌బాగ్ తరహాలోనే జాతీయ జెండాలు, ఆజాద్ స్లోగన్‌లతో ప్రదర్శనలు జరిగాయి. తాజాగా, ఢిల్లీలోని జాఫ్రాబాద్ ఏరియాలో షహీన్‌బాగ్ ఆందోళనలను పోలిన నిరసనే శనివారం రాత్రి మొదలైంది. సుమారు ఐదు వందల మంది మహిళలు శనివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో కీలక రోడ్డు మార్గంపై సీఏఏ, ఎన్ఆర్‌సీని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఈ మహిళా ఆందోళనకారుల సంఖ్య ఇప్పుడు 1500లకు చేరినట్టు సమాచారం. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. అందుకే నిరసనకారులతో చర్చించబోతున్నట్టు వివరించారు. కాగా, ట్రాఫిక్ దృష్ట్యా ఢిల్లీ మెట్రో.. జాఫ్రాబాద్ స్టేషన్‌లో సేవలు నిలిపేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ రావణ్ ఇచ్చిన పిలుపునకూ ఈ మహిళా ఆందోళనకారులు మద్దతునిస్తున్నారు.