రెండు గంటల్లో దారుస్సలాంను కూల్చేస్తాం: సంజయ్

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెబుతున్నాడనీ…హిందువుల ఆరాధ్యుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ సమాధిని తొలగిస్తారా..అయితే దమ్ముంటే తొలగించండి చూద్దామని సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే దారుస్సలాంను రెండు గంటల్లోనే కూల్చేస్తారని అన్నారు. ఇదే విషయం పై బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేస్తూ..  ’పి.వి,ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఓవైసీ అన్నాడు. దమ్ముంటే కూల్చండి. మీరు […]

Update: 2020-11-25 03:05 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెబుతున్నాడనీ…హిందువుల ఆరాధ్యుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ సమాధిని తొలగిస్తారా..అయితే దమ్ముంటే తొలగించండి చూద్దామని సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే దారుస్సలాంను రెండు గంటల్లోనే కూల్చేస్తారని అన్నారు.

ఇదే విషయం పై బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేస్తూ.. ’పి.వి,ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఓవైసీ అన్నాడు. దమ్ముంటే కూల్చండి. మీరు కూల్చిన రెండు గంటల్లో బిజెపి కార్యకర్తలు మీ దారుస్సలాం ని కూల్చుతారు. దారుస్సలాంలో సౌండ్ చేస్తే ప్రగతిభవన్‌లో ఎందుకు రిసౌండ్ వస్తుంది. టిఆర్ఎస్ స్క్రిప్ట్‌నే దారుస్సలాం వాళ్ళు చదువుతున్నారు. ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే నల్లజెండాలతో నిరసన తెలిపిన వాళ్లపై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయొద్దు?’ అని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News