ఓయూలో గోడ కూల్చివేత
దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని వివాదస్పద భూమిలోని గోడను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కోర్టు కేసులో ఉన్న ఈ భూముల్లో రిటైర్డ్ జడ్జి కుటుంబం ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టిందంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జడ్జి కుటుంబ సభ్యులు మాత్రం ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద స్థలంలోని ఇటుక గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా గోడ […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని వివాదస్పద భూమిలోని గోడను సోమవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కోర్టు కేసులో ఉన్న ఈ భూముల్లో రిటైర్డ్ జడ్జి కుటుంబం ఇటీవలే గోడ నిర్మాణం చేపట్టిందంటూ విద్యార్థి, అధ్యాపక సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జడ్జి కుటుంబ సభ్యులు మాత్రం ఈ భూమి తమ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద స్థలంలోని ఇటుక గోడను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా గోడ నిర్మించినందున కూలగొట్టినట్టు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.