ఆ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పై తరగతులకు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ విద్యార్థుల పరీక్షలపై ప్రభావం చూపుతోంది. గతేడాది విద్యా సంవత్సరం పూర్తయ్యాక పరీక్షల సమయంలో కరోనా రావడంతో పది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టి స్కూల్స్,కాలేజీలు మొదలయ్యి మూడు నెలలు క్లాసులు జరిగాయి. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం తిరిగి పాఠశాలలు, కాలేజీలను మూసేసింది. ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ విద్యార్థుల పరీక్షలపై ప్రభావం చూపుతోంది. గతేడాది విద్యా సంవత్సరం పూర్తయ్యాక పరీక్షల సమయంలో కరోనా రావడంతో పది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టి స్కూల్స్,కాలేజీలు మొదలయ్యి మూడు నెలలు క్లాసులు జరిగాయి. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వం తిరిగి పాఠశాలలు, కాలేజీలను మూసేసింది. ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ విద్యార్థులందరినీ పాస్ చేసి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
ముందుగా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనుకున్నా.. కరోనా రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ సారి కూడా పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్ చేసింది. పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేంద్రం నిర్వహించే జాతీయ నీట్ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇలా అన్ని పరీక్షలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం డిగ్రీ విద్యార్థుల పరీక్షల విషయంపై చర్చలు జరిపిన విద్యాశాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీసీఏ, బీబీఏ, బిఎస్సీ, బీ.కామ్ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే రెండవ సంవత్సరానికి ప్రమోట్ చేయాలని బుధవారం నిర్ణయించుకుంది.
అనంతరం మిగతా యూనివర్సిటీలు ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే డిప్లామా విద్యార్థుల పరీక్షల విషయంలోనూ ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థుల విషయాన్ని ప్రభుత్వం పునరాలొచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను కరోన బారిన పడకుండా పరీక్షలు నిర్వహించడం కష్టతరమని బావించిన ప్రభుత్వం త్వరలోనే అన్ని రకాల కోర్సుల్లోని పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.