Rules Ranjann: ఓటీటీలోకి వచ్చేసిన ‘రూల్స్ రంజన్’..
రాజావారు రాణివారు సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
దిశ,వెబ్ డెస్క్: రాజావారు రాణివారు సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు.. ఈ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ కు మంచి ఫాలోయింగ్ వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పటివరకు కిరణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయాయి. ఇక తాజాగా నటించిన కిరణ్ అబ్బవరం నటించిన లేటేస్ట్ సినిమా రూల్స్ రంజన్. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన 60 రోజుల తర్వాత ఈ సినిమా నవంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలవ్వక ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకున్నాయి.