ఉస్మానియా చరిత్రలోనే తొలిసారి ఇలా..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చరిత్రలో మొదటిసారి ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని ఖాళీ చేశారు. రోగులందరినీ కూలీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. దీంతో పాత భవనం పూర్తిగా రోగులు లేకుండా ఖాళీగా దర్శనమివ్వడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈసందర్భంగా హాస్పిటల్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండునాయక్ మాట్లాడుతూ.. డ్రైనేజీ మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు మూడు శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన వారం రోజులగా నగరంలో భారీ వర్షాలు పడుతుండటంతో ఉస్మానియా ఆసుపత్రి […]

Update: 2020-07-17 08:21 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: చరిత్రలో మొదటిసారి ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని ఖాళీ చేశారు. రోగులందరినీ కూలీ కుతుబ్ షా భవనంలోకి తరలించారు. దీంతో పాత భవనం పూర్తిగా రోగులు లేకుండా ఖాళీగా దర్శనమివ్వడం వందేళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. ఈసందర్భంగా హాస్పిటల్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పాండునాయక్ మాట్లాడుతూ.. డ్రైనేజీ మరమ్మత్తు పనులు పూర్తి చేసేందుకు మూడు శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన వారం రోజులగా నగరంలో భారీ వర్షాలు పడుతుండటంతో ఉస్మానియా ఆసుపత్రి వరద నీటిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News