వ్యాయామ టీచర్లకు ఓరియంటేషన్ శిక్షణ..!
దిశ, సిద్దిపేట: సిద్దిపేట, మెదక్ జిల్లాలో పనిచేస్తున్న వ్యాయామ టీచర్లందరికీ ఈనెల 14వ తేదీ నుంచి పది రోజులపాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ రవికాంత్ రావు తెలిపారు. వ్యాయామ విద్యలో భాగంగా పనిచేస్తున్న టీచర్లకు పలు రకాల ఆటలు, యోగ, ఆరోగ్య, విద్య, ప్రథమ చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణలో పాల్గొనాలని విద్యాధికారి రవికాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 14వ తేదీ ఉదయం […]
దిశ, సిద్దిపేట: సిద్దిపేట, మెదక్ జిల్లాలో పనిచేస్తున్న వ్యాయామ టీచర్లందరికీ ఈనెల 14వ తేదీ నుంచి పది రోజులపాటు ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ రవికాంత్ రావు తెలిపారు. వ్యాయామ విద్యలో భాగంగా పనిచేస్తున్న టీచర్లకు పలు రకాల ఆటలు, యోగ, ఆరోగ్య, విద్య, ప్రథమ చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఈ శిక్షణలో పాల్గొనాలని విద్యాధికారి రవికాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. 14వ తేదీ ఉదయం 10.30-12.00 గంటల వరకు క్లాసులు ఉండనున్నట్లు.. 15వ తేదీ ఉదయం 7-8 గంటల వరకు యోగా శిక్షణ ఉండనున్నట్టు వెల్లడించారు, Zoom యాప్ ద్వారా శిక్షణ ఉండనున్నట్లు దీనికి సంబంధించిన ఐడీ పాస్వర్డ్లను పంపించడం జరుగుతోందని రవికాంత్ తెలిపారు.