హైదరాబాద్‌లో 'ఆరెంజ్‌' హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులను జలమండలి ఎండీ దాన కిశోర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండ్రోజులు జీహెచ్‌ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు […]

Update: 2020-10-13 09:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండ్రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులను జలమండలి ఎండీ దాన కిశోర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండ్రోజులు జీహెచ్‌ఎంసీ పరిధిలో అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్‌ వెల్లడించారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దన్నారు. ఎంతటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags:    

Similar News