క్లౌడ్ సేవల కోసం ఎయిర్‌టెల్‌తో ఒరాకిల్ భాగస్వామ్యం!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎయిర్‌టెల్ డేటా సెంటర్‌తో క్లౌడ్ సేవల కంపెనీ ఒరాకిల్ భాగస్వామ్యం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీలవుతుందని ఒరాకిల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ నెక్స్ట్రాతో కలిసి నిర్వహిస్తున్న క్లౌడ్ సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఒరాకిల్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు గారెట్ ఇల్గ్ అన్నారు. […]

Update: 2021-11-10 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎయిర్‌టెల్ డేటా సెంటర్‌తో క్లౌడ్ సేవల కంపెనీ ఒరాకిల్ భాగస్వామ్యం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్లో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీలవుతుందని ఒరాకిల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ముంబైతో పాటు హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ నెక్స్ట్రాతో కలిసి నిర్వహిస్తున్న క్లౌడ్ సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుందని ఒరాకిల్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు గారెట్ ఇల్గ్ అన్నారు.

అయితే ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను గారెట్ వెల్లడించలేదు. ‘ఎయిర్‌టెల్‌కు భారత మార్కెట్లో మెరుగైన వినియోగదారుల నెట్‌వర్క్ ఉంది. దీనివల్ల భారత్‌లో తమ కస్టమర్లను వేగంగా పెంచుకునేందుకు వీలవుతుంది. తక్కువ రిస్క్‌తో పాటు వినియోగదారుల విశ్వాసం పొందేందుకూ ఈ భాగస్వామ్యం కీలకంగా ఉంటుందనే నమ్మకం ఉంది’ అని గారెట్ వివరించారు.

కాగా ఈ భాగస్వామ్యం ద్వారా ఒరాకిల్ కంపెనీ 10 లక్షలకు పైగా ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు క్లౌడ్ సేవలను అందించడానికి వీలవుతుంది. భవిష్యత్తులో డిజిటల్ సేవలను వాడేందుకు సిద్ధంగా ఉన్న లక్షల మంది వ్యాపారులకు సైతం ఈ ఒప్పందం ఆకర్షణీయంగా ఉండనుంది. ప్రముఖ పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ ప్రకారం 2025 నాటికి భారత్‌లో క్లౌడ్ సేవల వ్యయం 12 బిలియన్ డాలర్లు(రూ. 89.2 వేల కోట్లు) ఉండొచ్చని అంచనా.

Tags:    

Similar News