పోలీసులు vs అఖిలపక్షం.. నాగర్ కర్నూలులో ఉద్రిక్తత
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విపక్ష పార్టీల నేతలు యత్నించారు. అంతేగాకుండా.. కలెక్టర్ ఛాంబర్ గోడకు వినతి పత్రాన్ని అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ, సీపీఐ […]
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాకు అధికారులు స్పందించకపోవడంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విపక్ష పార్టీల నేతలు యత్నించారు. అంతేగాకుండా.. కలెక్టర్ ఛాంబర్ గోడకు వినతి పత్రాన్ని అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి బాల్ నరసింహ, సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడారు.
విపక్షాల నిరసనకు అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. పోలీసులు సైతం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటికైనా పట్టాలిచ్చి ఆదుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రానున్న అక్టోబర్ 5న చేపట్టిన ‘సడక్ బంద్’ను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు.