ఆ ఆసుపత్రి మూత… ప్రభుత్వ కుట్రలో భాగమే
దిశ, హుస్నాబాద్: ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేయడంపై విపక్ష పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ నాయకులు గడిపే మల్లేశ్ అధ్యక్షతన సోమవారం విపక్షాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అత్యవసరమైన పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తూ.. కరోనా పేషెంట్లను ఆదుకుంటున్న నవ్య ఆస్పత్రిపై అకారణంగా దాడి చేసి మూయించడం ప్రభుత్వ […]
దిశ, హుస్నాబాద్: ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేయడంపై విపక్ష పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ నాయకులు గడిపే మల్లేశ్ అధ్యక్షతన సోమవారం విపక్షాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అత్యవసరమైన పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తూ..
కరోనా పేషెంట్లను ఆదుకుంటున్న నవ్య ఆస్పత్రిపై అకారణంగా దాడి చేసి మూయించడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ప్రజా ఉద్యమాల్లో ఎదుగుతున్న చెరుకు సుధాకర్‌ను అణిచి వేయాలని, ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. సీజ్ చేసిన ఆస్పత్రిని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.