విపక్షాలు ఫస్ట్ టైం ఇలా చేయబోతున్నాయి !

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి చర్యలపై చర్చించేందుకు 15 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ పాల్గొనే అవకాశమున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపుగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ మహమ్మారిపై చర్చించారు. కరోనా […]

Update: 2020-05-19 04:10 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడి చర్యలపై చర్చించేందుకు 15 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నేతలు భేటీ కానున్నారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ పాల్గొనే అవకాశమున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపుగా అన్ని రాష్ట్రాల సీఎంలు ఈ మహమ్మారిపై చర్చించారు. కరోనా కట్టడి చర్యలపై ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌లో మీడియాతో సమావేశాలు నిర్వహించారు. కానీ, విపక్ష పార్టీల నేతలు ఇలా ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ కావడం ఇదే మొదటిసారి.

Tags:    

Similar News