oppo నుంచి మెుట్టమెుదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ oppo కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. OPPO ‘INNO DAY 2021’ ఈవెంట్‌లో మెుట్టమెుదటి ‘ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Find N’ విశేషాలను బయటి ప్రపంచానికి విడుదల చేసింది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ ఫోన్ లభిస్తుంది. ఈ నెల చివరన ఇది కొనుగోలుదారులకు అందుబాటులో రానుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy Z Fold 3 కి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు. స్పెసిఫికేషన్స్.. OPPO Find N, […]
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ oppo కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. OPPO ‘INNO DAY 2021’ ఈవెంట్‌లో మెుట్టమెుదటి ‘ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Find N’ విశేషాలను బయటి ప్రపంచానికి విడుదల చేసింది. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ ఫోన్ లభిస్తుంది. ఈ నెల చివరన ఇది కొనుగోలుదారులకు అందుబాటులో రానుంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy Z Fold 3 కి పోటీగా ఉంటుందని భావిస్తున్నారు.
స్పెసిఫికేషన్స్..
OPPO Find N, 7.1-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 5.49-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు ట్రిపుల్-కెమెరా (50MP +16MP + 13MP), సెల్ఫీ కెమెరాలు (32MP + 32MP) లోపలి, బయటి డిస్‌ప్లేలలో వస్తుంది. ప్రాసెసర్ Qualcomm Snapdragon 888 పై పనిచేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 4,500mAh. ఇది రోజంతా పని చేస్తుందని సంస్థ పేర్కొంది. దీనికి సపోర్టుగా 33W ఫ్లాష్ ఛార్జర్‌ను అందిస్తోంది. ఇది 30 నిమిషాల్లో 55 శాతం,70 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేస్తుంది.
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, అలాగే డ్యూయల్ స్పీకర్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్. దీని ధర రూ.92,100. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,07,600. కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించగా, సేల్ డిసెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఇది బ్లాక్, పర్పుల్, వైట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.