నగర ప్రజలకు శుభవార్త.. ఇవాళ..

దిశ, న్యూస్​బ్యూరో: వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్​ఆర్​డీపీ)లో భాగంగా మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.26.45 కోట్లతో బైరామల్​గూడ జంక్షన్​లో నిర్మించిన ఫ్లైఓవర్​ను నేడు (ఆగస్టు 10న) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. ఎస్​ఆర్​డీపీ ప్యాకేజీ–2లో భాగంగా రూ. 448 కోట్ల వ్య‌యంతో పనులను 14 పనులను చేపట్టడగా.. బైరామల్​గూడ ఫ్లైఓవర్​తో కలిపి ఆరు పనులు పూర్తయ్యాయి. ఇతర పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్యాకేజీ–2లో పూర్తయిన పనులు ఎస్​ఆర్​డీపీ […]

Update: 2020-08-09 20:13 GMT

దిశ, న్యూస్​బ్యూరో: వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్​ఆర్​డీపీ)లో భాగంగా మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. రూ.26.45 కోట్లతో బైరామల్​గూడ జంక్షన్​లో నిర్మించిన ఫ్లైఓవర్​ను నేడు (ఆగస్టు 10న) పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. ఎస్​ఆర్​డీపీ ప్యాకేజీ–2లో భాగంగా రూ. 448 కోట్ల వ్య‌యంతో పనులను 14 పనులను చేపట్టడగా.. బైరామల్​గూడ ఫ్లైఓవర్​తో కలిపి ఆరు పనులు పూర్తయ్యాయి. ఇతర పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

ప్యాకేజీ–2లో పూర్తయిన పనులు

ఎస్​ఆర్​డీపీ ప్యాకేజి-2లో 14 పనులను ప్రతిపాదించారు. భాగంగా ఇప్పటి వరకు ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌లో రూ.29.27కోట్లు, కామినేని జంక్షన్​లో రూ.46.40కోట్లు, రూ. రూ.13.25కోట్లతో చింతల్​కుంట జంక్షన్​లో కలిపి ఐదు పనులు పూర్తి చేశారు. బైరామల్​ గూడలో మొత్తం రూ.125.53 కోట్లతో పనులను ప్రతిపాదించారు. ఇందులో రూ.24.37 కోట్లతో నిర్మించిన కుడి వైపు ఫ్లైఓవర్​కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మరో రూ.24.23కోట్లతో నిర్మిస్తున్న ఎడమ వైపు ఫ్లైఓవర్​ పనులు 35శాతం పూర్తయ్యాయి. సెకండ్​ లెవల్​ ఫ్లైఓవర్​తో పాటు మరో రెండు ఇతర పనులకు ఇప్పటివరకూ గ్రౌండింగ్​ కూడా పూర్తి కాలేదు.

పీక్​ అవర్​లో 18,653 వాహనాల రద్దీ

బైరామ‌ల్ గూడ జంక్ష‌న్‌లో కుడి వైపు నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్​పై మూడు లైన్లతో ఒన్​ సైడ్​ వేలో వాహనాలు ప్రయాణిస్తాయి. ఫ్లైఓవర్​ అందుబాటులోకి వస్తే సాగ‌ర్‌రోడ్ జంక్షన్​పై ఒత్తిడి త‌గ్గుతుండంతో పాటు సికింద్రాబాద్​ నుంచి ఓవైసీ ఆస్పత్రి వైపు వచ్చే రూట్​లో ట్రాఫిక్​ రద్దీ తగ్గుతుంది. ఇంధన ఆదా, ప్రయాణ సమాయం మిగులుతోంది. ఇండియాలో మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్​ ప్రమాదాల తీవ్రతను తగ్గించేలా రూపొందించారు. 2015లో పీక్​ అవర్​లో ఈ రూట్​లో 7,481 పీసీయూలు ప్రయాణిస్తుండగా.. 2034 నాటికి వీటికి సంఖ్య 18,653కు చేరనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫ్రీ ఫ్లో ట్రాఫిక్​ నగరంగా తీర్చిదిద్దుతాం: బొంతు రామ్మోహన్​, జీహెచ్​ఎంసీ మేయర్​

హైదరాబాద్​ను ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ నగరంగా మార్చేందుకు ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను చేప‌డుతున్నాం. దేశంలోని మొదటిసారిగా కొత్త టెక్నాలజీతో బైరామల్​గూడ్​ ఫ్లైఓవర్​ను నిర్మించాం. ఈ టెక్నాలజీ వల్ల ప్రమాదాల సంఖ్య, తీవ్రత తగ్గుతుంది. ఎస్​ఆర్​డీపీ ప్రాజెక్టుల ద్వారా సిటీలో రవాణా, ట్రాఫిక్​ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.

Tags:    

Similar News