కేవలం 20 శాతం రైతులకే రైతుబంధు

దిశ, నల్లగొండ: అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ పశ్య పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకానికి రూ.14 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించినా.. రైతులకు అందడం లేదన్నారు. కేవలం 20 శాతం మంది రైతులకు మాత్రమే డబ్బులు అందాయని తెలిపారు. రైతుబంధు అర్హుల లిస్ట్ వెబ్‌సైట్‌లో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు […]

Update: 2020-06-05 06:39 GMT

దిశ, నల్లగొండ: అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ పశ్య పద్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుబంధు పథకానికి రూ.14 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించినా.. రైతులకు అందడం లేదన్నారు. కేవలం 20 శాతం మంది రైతులకు మాత్రమే డబ్బులు అందాయని తెలిపారు. రైతుబంధు అర్హుల లిస్ట్ వెబ్‌సైట్‌లో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు వెబ్‌సైట్‌లో పెట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు మోరగుండ్ల లక్ష్మయ్య, జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, పుట్టపాక అంజయ్య, దొరపెళ్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News