ఆన్‌లైన్‌లో యాదాద్రి నరసింహుడి ఆర్జిత సేవలు
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి అన్ని దేవాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల అభీష్టం మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆర్జిత సేవల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా పాల్గొనే వెసులుబాటును కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. నిజాభిషేకం రూ. 500, సహస్రనామార్చన రూ.500, సుదర్శన నరసింహ హోమం రూ. 1,116, స్వామివారి స్వర్ణ పుష్పార్చన రూ.500గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న భక్తులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. పూర్తి వివరాల కోసం […]
దిశ, నల్లగొండ: కరోనా మహమ్మారిని కట్టడిచేయడానికి అన్ని దేవాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల అభీష్టం మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆర్జిత సేవల్లో భక్తులు ఆన్లైన్ ద్వారా పాల్గొనే వెసులుబాటును కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. నిజాభిషేకం రూ. 500, సహస్రనామార్చన రూ.500, సుదర్శన నరసింహ హోమం రూ. 1,116, స్వామివారి స్వర్ణ పుష్పార్చన రూ.500గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న భక్తులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. పూర్తి వివరాల కోసం https://ts.meeseva.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శంచాలని తెలిపారు.
Tags: yadadri, online, aarjitha sevalu, nallagonda, ts news