నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం విధించిన గైడ్‌లెన్స్ ప్రకారం నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, టైం టేబుల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్లతోపాటు సీబీఎస్ఈ స్కూళ్లు జూన్ నుంచే ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఆన్‌లైన్ క్లాసుల్లో విద్యార్థులపై అధిక ఒత్తిడి పడకుండా టైం టేబుల్ సిద్ధం […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం విధించిన గైడ్‌లెన్స్ ప్రకారం నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, టైం టేబుల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే కార్పొరేట్ స్కూళ్లతోపాటు సీబీఎస్ఈ స్కూళ్లు జూన్ నుంచే ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. తాజాగా సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.
ఆన్‌లైన్ క్లాసుల్లో విద్యార్థులపై అధిక ఒత్తిడి పడకుండా టైం టేబుల్ సిద్ధం చేశారు. దూరదర్శన్, టీ-శాట్ ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులుకు డిజిటల్ క్లాసులను బోధించనున్నారు. వారికి ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ తరగతులను సెప్టెంబర్ 14 వరకు కొనసాగించనున్నట్లు వివరించింది.
కాగా 3 నుంచి 10వ తరగతి వరకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. ఒక్కో క్లాస్ 30 నిమిషాల పాటు బోధించనన్నారు. ప్రతీ విద్యార్థికి క్లాసెస్ రీచ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అందరు విద్యార్థులు ఈ ఆన్‌లైన్ క్లాసులను ఉపయోగించుకునేల చూసే బాధ్యత టీచర్లదేనని స్పష్టం చేసింది ప్రభుత్వం. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ బాధ్యత తీసుకోవాలని చెబుతోంది సర్కార్.