అమ్మవారికి ఆన్‌లైన్ బోనం.. టికెట్ ధర ఎంతంటే.?
దిశ, వెబ్‌డెస్క్ :ఆషాడ మాసం ప్రారంభం కాగానే.. తెలంగాణలో అందరికీ బోనాల పండుగ కళ్ల ముందు కదలాడుతుంది. తెలంగాణ సాంప్రదాయంలో అనాదిగా బోనాల పండుగ ఓ భాగంగా ఉంది. తమ ఇలవేల్పు దైవం, అమ్మవార్ల కోసం ప్రతీ ఏటా మహిళలు బోనమెత్తి పూజలు చేస్తారు. పిల్లాపాపలను చల్లంగా దీవించు తల్లీ అని వేడుకుంటారు. బోనాల పండుగ అనగానే పోతురాజులు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు.. డప్పుచప్పుళ్లు.. బోనాల ఊరేగింపు ఓ పెద్ద జాతరనే తలపిస్తుంది. అయితే, కరోనా కారణంగా […]
దిశ, వెబ్‌డెస్క్ :ఆషాడ మాసం ప్రారంభం కాగానే.. తెలంగాణలో అందరికీ బోనాల పండుగ కళ్ల ముందు కదలాడుతుంది. తెలంగాణ సాంప్రదాయంలో అనాదిగా బోనాల పండుగ ఓ భాగంగా ఉంది. తమ ఇలవేల్పు దైవం, అమ్మవార్ల కోసం ప్రతీ ఏటా మహిళలు బోనమెత్తి పూజలు చేస్తారు. పిల్లాపాపలను చల్లంగా దీవించు తల్లీ అని వేడుకుంటారు. బోనాల పండుగ అనగానే పోతురాజులు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు.. డప్పుచప్పుళ్లు.. బోనాల ఊరేగింపు ఓ పెద్ద జాతరనే తలపిస్తుంది. అయితే, కరోనా కారణంగా ఈ ఏడాది బోనాలు సాదాసీదాగానే జరిగే అవకాశం ఉంది.
కరోనా సమయం కాబట్టి చాలామందికి బోనం సమర్పించే వీలు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బోనాలను ప్రారంభించనుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆన్‌లైన్ బోనాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు దేవాలయ వెబ్‌సైట్, పోస్ట్ ఆఫీస్‌లో బోనం బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బోనం బుక్ చేసుకుంటే.. నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. గోత్ర నామాలతో సహా పేర్లు నమోదు చేస్తే.. వాళ్లే బోనం సమర్పిస్తారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ బోనం బుక్ చేసుకున్న భక్తుని ఇంటికి ప్రసాదం కూడా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ బోనం ధరను రూ. 200 కేటాయించినట్టు తెలుస్తోంది. బోనాల పండుగ జూలై 11వ తేదీ నుంచి ఆగస్టు 8 తేదీ వరకు జరుగనుంది.