అన్నదాతలకు ఆన్‌లైన్ వ్యవసాయ కన్సల్టేషన్
దిశ, న్యూస్‌బ్యూరో: అన్నదాతల కోసం టి.కన్సల్ట్ యాప్‌ను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించింది. వ్యవసాయంలోని సమస్యలపై సమగ్ర అవగాహన, తాజా పరిస్థితుల వివరాలు, సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు శాస్త్రవేత్తలను, రైతులకు అనుసంధానం చేసేలా సన్నాహాలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు టీటా కృషి చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం స్వయంగా నిపుణులతో అనుసంధానమయ్యారు. ఈ […]
దిశ, న్యూస్‌బ్యూరో: అన్నదాతల కోసం టి.కన్సల్ట్ యాప్‌ను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించింది. వ్యవసాయంలోని సమస్యలపై సమగ్ర అవగాహన, తాజా పరిస్థితుల వివరాలు, సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు శాస్త్రవేత్తలను, రైతులకు అనుసంధానం చేసేలా సన్నాహాలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక మండలంలో నిర్వహించిన అనంతరం విదేశాల్లోని నిపుణులతోనూ మన రైతులను అనుసంధానం చేసేందుకు టీటా కృషి చేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం స్వయంగా నిపుణులతో అనుసంధానమయ్యారు. ఈ యాప్‌కు సంబంధించి తొలి వినియోగదారుడిగా వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావుతో టి.కన్సల్ట్ ద్వారా రైతులకు సంబంధించిన సందేహాలు అడిగి తెలుసుకున్నారు.
అపాయింట్ మెంట్‌తో సలహాలు
టి.కన్సల్ట్ ద్వారా అందుబాటులోకి వస్తున్న ఆన్‌లైన్ అగ్రి కన్సల్టేషన్ ద్వారా రైతులు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని అగ్రికల్చర్ సైంటిస్టులతో సలహాలు పొందవచ్చు. సైంటిస్టులతో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అగ్రికల్చర్ వర్సిటీ వారితో చర్చలు జరిపింది. ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా రైతులు.. శాస్త్రవేత్తలతో అనుసంధానం కావచ్చు. ఇతర దేశాల్లో ఉండే వ్యవసాయ నిపుణులతో రైతులు అనుసంధానం అయ్యేలా చూడటం సైతం టి.కన్సల్ట్ ప్రణాళికలో ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్‌లో టి.కన్సల్ట్ ప్రారంభించి, టి.కన్సల్ట్ ద్వారా పది వేల కన్సల్టేషన్లు చేయడాన్ని అభినందించారు. కార్యక్రమంలో టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల, వి.ప్రకాష్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్ కే సంగమేశ్వర రావు పాల్గొన్నారు.